Naturo Classic
(2002)
8.6
23min
Crunchyroll
స్టోరీ: నారుటో అనేది నారుటో ఉజుమాకి అనే యువ నిన్జా యొక్క ఎపిక్ జర్నీ. హిడెన్ లీఫ్ విలేజ్‌లో అనాథగా పెరిగిన నారుటో, తనలో సీల్ చేయబడిన నైన్-టెయిల్స్ ఫాక్స్ డెమన్ కారణంగా ఒంటరిగా ఉంటాడు. అయినా, అతని లక్ష్యం గ్రామంలోని అత్యున్నత నిన్జా అయిన హోకాగె కావడం. స్నేహం, పట్టుదల, బాధ్యతల చుట్టూ తిరిగే ఈ కథలో నారుటో తన స్నేహితులు సాసుకే, సాకురా, కాకాషిలతో కలిసి అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. యాక్షన్, ఎమోషన్, హాస్యం కలగలిపిన ఈ సిరీస్ యానిమే ఫ్యాన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సోనీ యాయ్, క్రంచీరోల్‌లో అందుబాటులో ఉన్న తెలుగు డబ్ నారుటోని స్థానిక ఆడియన్స్‌కి దగ్గర చేసింది, కానీ పర్ఫెక్ట్ అనలేము. సాయి సుజిత్ నారుటోకి ఇచ్చిన డబ్బింగ్ అద్భుతం—అతని చిలిపి, ఎనర్జిటిక్ టోన్ నారుటో యొక్క నీవర్-గివ్-అప్ స్పిరిట్‌ని జీవం పోస్తుంది. యాక్షన్ సీన్స్‌లో డబ్బింగ్ ఎనర్జీ అదిరిపోతుంది,కానీ పర్ఫెక్ట్ అనలేమ . స్క్రిప్ట్ కొన్ని చోట్ల తడబడింది—జపనీస్ కల్చరల్ రిఫరెన్స్‌లు, నిన్జా టెర్మ్స్ (చక్ర, జుట్సు) అనువాదంలో కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్‌లో డైలాగ్‌లు ఒరిజినల్ ఫీల్‌ని పూర్తిగా క్యాప్చర్ చేయలేకపోయాయి. అయినా, డబ్బింగ్ టీమ్ సీన్‌కి తగ్గట్టు వాయిస్ ఇచ్చి, అన్ని ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేసి మెప్పించారు. సాయి సుజిత్ డబ్బింగ్ ఈ డబ్‌లో హైలైట్ అని చెప్పాలి!
ఎందుకు చూడాలి?: నారుటో అనేది యాక్షన్, స్నేహం, పట్టుదల గురించి ఒక టైమ్‌లెస్ యానిమే. తెలుగు డబ్ ఈ సిరీస్‌ని కొత్త జనరేషన్‌కి, ముఖ్యంగా టీన్స్‌కి అందుబాటులోకి తెచ్చింది. క్రంచీరోల్,సోనీ యాయ్ లో అందుబాటులో ఉన్న 93 ఎపిసోడ్స్ బింజ్-వాచ్‌కి పర్ఫెక్ట్. నిన్జా అడ్వెంచర్స్, ఎమోషనల్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ మిస్ అవ్వకూడదు!
నీట్‌గా చెప్పాలంటే: నారుటో తెలుగు డబ్‌తో యాక్షన్, ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్‌ని మీ గుండెల్లోకి తీసుకెళ్తుంది. నీవర్-గివ్-అప్ స్పిరిట్‌తో నారుటో మీకు స్ఫూర్తినిస్తాడు. నారుటో షిప్పుడెన్ ఫ్యాన్స్‌కి ఈ ఒరిజినల్ సిరీస్ రీ-వాచ్ విలువైన ట్రీట్!
Studio Pierrot
తెలుగు
Masashi Ksihimoto